సినిమా వార్తలు

చిరంజీవి సరసన నయనతార ఫిక్ప్


9 months ago చిరంజీవి సరసన నయనతార ఫిక్ప్

దర్శకుడు కొరటాల శివ తన తరువాతి సినిమాను చిరంజీవితో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టుగా సమాచాచం. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఎంపికచేశారని తాజా సమాచారం. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అనుష్క, నయనతార, త్రిష, శ్రియ మొదలైన వారు మాత్రమే సీనియర్ కథానాయికలుగా కనిపిస్తున్నారు. వీళ్లందరిలోకెల్లా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ నయనతార. అందుకనే 'సైరా' కోసం ఆమెనే తీసుకున్నారు. కొరటాల సినిమా విషయంలోను కథానాయిక సమస్య ఏర్పడింది. తనకున్న క్రేజ్ కి తగిన జోడీగాను నయనతార అయితేనే బాగుంటుందని చిరంజీవి సూచించడంతో, ఆమెనే హీరోయిన్ గా కొరటాల ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది.