సినిమా వార్తలు

జయలలితగా నయనతార


12 months ago జయలలితగా నయనతార

దేశంలోని అన్ని భాషల సినిమాల్లోనూ బయోపిక్ ల హవా కొనసాగుతోంది. కొన్ని బయోపిక్ లు ఆల్రెడీ విజయం సాధించగా, మరికొన్ని సెట్స్ మీద వున్నాయి. ఇక కోలీవుడ్లో కూడా బయోపిక్ ల జోరు పెరగనున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితచరిత్రను రూపొందించడానికి అక్కడ మూడు ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది. ఎవరికివారు సాధ్యమైనంత త్వరగా తమ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో వున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడు లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్ ను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. జయలలిత జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలున్నాయి. అవి ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. వాటన్నింటినీ కలుపుతూ లింగుస్వామి కథ సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. జయలలిత పాత్ర కోసం ఆయన నయనతారను సంప్రదించినట్టు సమాచారం. ఇంతటి బరువైన .. గంభీరమైన పాత్రను ఆమె మాత్రమే చేయగలదని చిత్ర యూనిట్ భావించినట్టు తెలుస్తోంది.