సినిమా వార్తలు

చిరు సరసన మరోమారు నయనతార!


8 months ago చిరు సరసన మరోమారు నయనతార!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, ఆగస్టు 15న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత కొరటాలతో చిరంజీవి చేయనున్న సినిమాలోను కథానాయికగా నయనతారనే తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి .. కొరటాల సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క, కాజల్, శ్రియ, త్రిష, శ్రుతిహాసన్ పేర్లను పరిశీలించారట. చివరికి తిరిగి నయతారనే తీసుకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే నయనతారతో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ గా నయనతారకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెనే తీసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో చిరంజీవి తదుపరి సినిమాలో ఆయనకు జోడీగా మరోసారి నయనతార అలరించనుందని స్పష్టమవుతోంది.