సినిమా వార్తలు

అమెరికాలో 'నవాబ్' సంచలనం


1 year ago అమెరికాలో 'నవాబ్' సంచలనం

తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన 'చక్క చివంత వానమ్' .. 'నవాబ్' పేరుతో తెలుగులో విడుదలైంది. అరవిందస్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, వాళ్ల సరసన కథానాయికలుగా జ్యోతిక, అదితీ రావు, ఐశ్వర్య రాజేశ్ నటించారు. తమిళనాట మాత్రమే కాదు, అమెరికాలోను ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వస్తోంది.  మాఫియా నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య సాగే పోరాటంగా ఈ కథ తెరకెక్కింది. కథలోని కొత్తదనం, కథనంలోని ఆసక్తి కారణంగా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని తెలుస్తోంది. తొలిరోజున ఈ సినిమా భారీ వసూళ్లనే రాబట్టినట్టుగా చెబుతున్నారు. అమెరికాలో తొలిరోజున ఈ సినిమా 1.25 కోట్లను వసూలు చేయడం విశేషమేనని అంటున్నారు. ఇదిలావుంటే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి మణిరత్నం చాలానే కష్టపడ్డారు. ఇందులో హీరోలుగా తెలుగు స్టార్లను ఎంచుకున్నాడు మణిరత్నం. అందుకోసమని ప్రముఖ తెలుగు హీరోలను కూడా సంప్రదించాడు. వారిలో నాగార్జున, మహేశ్ బాబు, రామ్ చరణ్, నానిలు ఉండటం విశేషం. ఒక దశలో ఈ సినిమాలో రెండు పాత్రలను చేయడానికి నాగార్జున, మహేశ్ బాబులు ఓకే చెప్పేశారని తెలుస్తోంది. అయితే ఎందుకో ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమాలో ఒక పాత్రకు రామ్ చరణ్ ను ఎంచుకున్నాడు మణిరత్నం. చరణ్ కూడా మొదట ఓకే అన్నట్టుగానే అన్నా.. తర్వాత తప్పుకున్నారట. అలాగే నాని పేరు కూడా ఈ సినిమాలో ఒక పాత్ర విషయంలో వినిపించింది. అయితే ఇతనూ చివరి వరకూ నిలవలేదని సమాచారం. ఏమైతేనేం ఇప్పడు నవాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు