సినిమా వార్తలు

కొత్తవాళ్లకి అవకాశాలిప్పిస్తున్న నవదీప్


7 months ago కొత్తవాళ్లకి అవకాశాలిప్పిస్తున్న నవదీప్

ఒక‌ప్పుడు యూత్ ఐకాన్ గా మెరిసి, ఇప్పుడు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల్లో స‌ర్దుకుపోతున్న హీరో న‌వ‌దీప్‌. ఆయన ఇప్పుడు ఓ కొత్త వ్యాపారంలోకి దిగుతున్నాడు. హైద‌రాబాద్‌లో న‌వ‌దీప్ ఓ బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాన్ని లీజుకు తీసుకున్నాడు. ఇందులో ఓ స్టూడియోలాంటిది ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. క‌థా చ‌ర్చ‌లు, ఎడిటింగ్‌, రీ రికార్డింగ్, వీటికి అనుగుణంగా ఓ అపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దుతున్నాడు. ఇందులో కాఫీ షాపులు, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఈరోజుల్లో షార్ట్ ఫిల్మ్‌, వెబ్ సిరీస్‌లు చేయ‌డానికి చాలామంది యువ‌తీయువ‌కులు ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ల‌కు త‌క్కువ ఖ‌ర్చులో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా నవదీప్ అందించ‌బోతున్నాడు. న‌వ‌దీప్‌కి సినీ ప‌రిశ్ర‌మలో ప‌రిచ‌యాలు అధికంగావున్నాయి‌. వాటిని ఉప‌యోగించుకుంటే, ఈ రంగంలో స‌క్సెస్ కావడం ఖాయంగానే క‌నిపిస్తోంది. స్టోరీ సిట్టింగుల కోసం సినిమావాళ్లు గోవా, బ్యాంకాక్‌లు వెళ్తుంటారు. లేదంటే స్థానికంగానే హోటెళ్ల‌లో భేటీ వేస్తుంటారు. కాఫీ షాపుల్లో మీటింగులు పెడుతుంటారు. ఈ అవ‌స‌రాల‌న్నీతీర్చేందుకు న‌వ‌దీప్ సిద్ధమయ్యాడని తెలుస్తోంది.