సినిమా వార్తలు

నానిని విలన్ గా చూపనున్న ఇంద్రగంటి


7 months ago నానిని విలన్ గా చూపనున్న ఇంద్రగంటి

తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఒకరుగా పేరొందారు. ఆయన తీసిన సినిమాలన్నీ చిన్నవే అయినా ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఇటీవల సుధీర్ బాబు, అదితిరావు హైదరి జంటగా ఇంద్రగంటి తెరకెక్కించిన ‘సమ్మోహనం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తన తరవాత ప్రాజెక్టుగా సుధీర్ బాబు, నానిలతో మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారని అంటున్నారు. ‘అష్టా చమ్మా’ సినిమా ద్వారా నానిని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి. ఆ తరవాత వీరి కాంబినేషనల్లో వచ్చిన ‘జెంటిల్‌‌మన్’ ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు మూడోసారి వీరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. అయితే ఈసారి నానిని ఇంద్రగంటి  నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో పాత్ర కోసం ఇంద్రగంటి గతంలో దుల్కర్ సల్మాన్, నిఖిల్ సిద్ధార్థ్ పేర్లను పరిశీలించారట. అయితే సుధీర్ బాబును  ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే విక్రమ్ కె.కుమార్‌తో ఇంకో సినిమాను నాని ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పడు ఈ మూడో సినిమాలో నాని విలన్‌గా ఎలా కనిపిస్తాడో వేచిచూడాలి.