సినిమా వార్తలు

ఆరుగురు హీరోయిన్స్ సరసన నాని


9 months ago ఆరుగురు హీరోయిన్స్ సరసన నాని

న్యాచురల్ స్టార్ నాని... గౌతమ్ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదే సమయంలో ‘మనం’ - ‘24’ లాంటి విభిన్నచిత్రాలను రూపొందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఒక సినిమాను చేయబోతున్నాడు. దీనిపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చిత్రయూనిట్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తోంది. మహిళల సమస్యలపై ఈ చిత్రం ఉండబోతున్నదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం గురించిన మరో ఆసక్తికర వార్త కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ ఉంటారని సమాచారం.

ఆరుగురిలో ఒక హీరోయిన్ తో నాని జతకడతాడని తెలుస్తోంది.  మిగిలిన ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. మహిళ సాధికారత గురించిన సీన్స్ లో వారు కనిపించే అవకాశం ఉందని భోగట్టా. ఇప్పటి వరకు ఒక్కో సినిమాలో ఒక్కో హీరోయిన్ తో మాత్రమే నటించిన ఈసారి ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ తో నటించ బోతున్నాడనే వార్త ఆస్తక్తికరంగా మారింది. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ మరిన్ని వివరాలు తెలియజేయాల్సివుంది.