సినిమా వార్తలు

కొత్త బాధ్యతల్లో న్యాచురల్ స్టార్ నాని


7 months ago కొత్త బాధ్యతల్లో న్యాచురల్ స్టార్ నాని

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. 'జెర్సీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఆయన, తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడని తెలుస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సహ నిర్మాతగా నాని వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత నిర్మాతగా ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసినట్టుగా సమాచారం. ఈ సినిమా ద్వారా సందీప్ రాజ్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కానున్నట్టుగా తెలుస్తోంది. 'అ' సినిమా తరహాలో ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉండనుందని చెబుతున్నారు. గతంలో నాని నిర్మించిన 'అ' సినిమా ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేదు. అయినా ఆయన మళ్లీ నిర్మాతగా కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.