సినిమా వార్తలు

‘జెర్సీ' నాని క్రికెట్ ప్రాక్టీస్


1 year ago ‘జెర్సీ' నాని క్రికెట్ ప్రాక్టీస్

నాని తాజా చిత్రంగా రూపొందిన 'దేవదాస్' ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని, తదుపరి సినిమా అయిన 'జెర్సీ'ని గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాలో నేను పూర్తిస్థాయి క్రికెటర్ గా కనిపిస్తాను .. బౌలర్ గా కాదు .. బ్యాట్స్ మెన్ గా. పదో తరగతి వరకూ నేను క్రికెట్ ఆడేవాడిని .. ఆ తరువాత మానేశాను. మళ్లీ ఇన్నాళ్లకి ఈ సినిమా కోసం బ్యాట్ పట్టుకోవలసి వచ్చింది. ఈ సినిమా కోసం ప్రతిరోజూ మూడున్నర గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ దగ్గర కూడా లేనంత క్రికెట్ ఎక్విప్ మెంట్ ఇప్పుడు నా ఇంట్లో ఉందంటే ఏ స్థాయిలో కష్టపడుతున్నానో అర్ధమయ్యే ఉంటుంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్ సినీతారల క్రికెట్ పోటీలు పెడితే నేనే బెస్ట్ ప్లేయర్ ను అవుతాను. ఈ సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను .. నా పాత్ర కొత్తగా అనిపిస్తుంది. దసరా రోజున ఈ సినిమాను లాంచ్ చేస్తున్నాం" అంటూ నాని చెప్పుకొచ్చాడు. దేవదాస్ గురించి మాట్లాడిన నాని... నా అభిమాన నటుడు నాగార్జునతో కలిసి నటించే అవకాశం .. వైజయంతీ మూవీస్ బ్యానర్లో చేసే ఛాన్స్ ఎందుకు వదులుకుంటాను? రెండో ఆలోచన చేయకుండా అంగీకరించాను. అయితే, సినిమా అంగీకరించిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. నాగ్ సార్ తో ఎలా ఉండాలో .. ఆయన నన్ను ఎలా ట్రీట్ చేస్తారో .. ఆయన కాంబినేషన్లో ఎలా చేయాలో అనే భయం ఉండేది. కానీ ఆయన మొదటి రోజే నాలోని భయాన్ని పోగొట్టారు .. నన్నెంతగానో ప్రోత్సహించారు. సినిమా విడుదలయ్యాక నా పాత్రకి దక్కే క్రెడిట్ అంతా కూడా ఆయనకే చెందుతుంది" అని చెప్పారు.