సినిమా వార్తలు

నాని ‘జెర్సీ’ షురూ!


11 months ago నాని ‘జెర్సీ’ షురూ!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని క్రికెట్ నేపథ్యంలో సాగే సినిమా రూపొందనుందనే సంగతి విదితమే. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని సంస్థ కార్యాలయంలోపూజా కార్యక్రమాలను నిర్వహించారు. నానిపై దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా తొలి షాట్ ను చిత్రీకరించారు. ఈ సినిమాలో నాని సరసన ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించనుందని తెలుస్తోంది. రెండు డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో నాని కనిపించనున్నాడని సమాచారం.

ఈ సినిమాను గురించి నిర్మాత మాట్లాడుతూ, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను రూపొందించనున్నామని తెలిపారు. అనిరుథ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్మాతలు చెబుతున్నారు.