సినిమా వార్తలు

రైతు పాత్రలో నాని?


11 months ago రైతు పాత్రలో నాని?

ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే కథతో ఇది రూపొందుతోంది. ఇందుకోసం నాని కొంతకాలంగా క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు జరుతున్నాయిన సమాచారం. ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుండగానే మరో ప్రాజెక్టుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలనే కిషోర్ అనే దర్శకుడు నానిని కలిసి ఒకలైన చెప్పారట.

కథలోని కొత్తదనం కారణంగా  వెంటనే నాని ఈ సినిమాకి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ కథ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో కొనసాగుతుందని సమాచారం. ఈ సినిమాలో రైతు పాత్రలో నాని కనిపించనున్నాడని అంటున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో చిత్ర యూనిట్ వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానుంది.