సినిమా వార్తలు

మల్టీ స్టారర్ లో నాని, దుల్కర్ సల్మాన్


10 months ago మల్టీ స్టారర్ లో నాని, దుల్కర్ సల్మాన్

ఇటీవలి కాలంలో వచ్చిన నాని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణకు నోచుకోలేదు. దాంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతానికి 'జెర్సీ' సినిమా చేస్తోన్న ఆయన, ఆ తరువాత సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ఈ సినిమా తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నాని సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. నానితో '96' మూవీని రీమేక్ చేద్దామనుకున్న దిల్ రాజు, ఇంద్రగంటి సిద్ధం చేసిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మల్టీ స్టారర్ మూవీ. అందువలన ఈ సినిమాలో మరో యువ హీరో అవసరంవుంది. పాత్ర పరంగా దుల్కర్ సల్మాన్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించిన దిల్ రాజు ఆయనను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దుల్కర్ అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.