సినిమా వార్తలు

నిమ్మకూరుకు రుణపడివుంటాం అంటున్న నందమూరి ఫ్యామిలి!


9 months ago నిమ్మకూరుకు రుణపడివుంటాం అంటున్న నందమూరి ఫ్యామిలి!

నిమ్మకూరుకు తామంతా రుణపడి ఉంటామని, ఈ ఊరు తమకెంతో ఇచ్చిందని ప్రముఖ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ‘ఎన్టీఆర్’ సినిమా యూనిట్ పర్యటించింది. ‘ఎన్టీఆర్’ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఇక్కడ నిర్వహించలేకపోయాం. అందుకే ఇక్కడి బంధువులందరినీ కలిసి వెళదామన్న మంచి కారణంతో బాబాయ్ బాలకృష్ణ ఇక్కడికి వచ్చారని... ‘హ్యాట్సాఫ్ బాబాయ్’ అంటూ బాలకృష్ణను కొనియాడారు. ఎన్టీఆర్ జీవితం గురించి అందరికీ తెలుసు కానీ, ఆయన కుటుంబంలో ఏం జరిగింది, మా తాతయ్యకు నాయనమ్మ బసవతారకం ఎంత తోడూనీడగా ఉన్నారు, ఎంతగా ప్రభావితం చేశారు.. తదితర అంశాలతో ‘ఎన్టీఆర్’ కథ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించబోతోందనడంలో ఎటువంటి సందేహం లేదని, మనకు పండగ మూడురోజుల ముందే వస్తోందని, ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుందని అన్నారు.