సినిమా వార్తలు

రిక్షావోడుగా బాలయ్య హల్‌చల్!


9 months ago రిక్షావోడుగా బాలయ్య హల్‌చల్!

ప్రస్తుతం బాలకృష్ణ..క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో బిజీగా  ఉన్న విషయం విదితమే. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నాలుగు షెడ్యూల్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దివిసీమ ప్రాంతంలో జరుగుతోంది. 70వ దశకంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో చాలా మంది  నిరాశ్రయులైయ్యారు.  ఆనాటి వరదల్లో సర్వం కోల్పోయిన వారి కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్‌ జోలెపట్టి విరాళాలు సేకరించారు. ప్రస్తుతం క్రిష్ దివిసీమకు సంబంధించిన సీన్స్‌ను  చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో బాలయ్యతో పాటు సుమంత్, రానా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా బాలయ్య...రిక్షా తొక్కుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ టాకీ పార్ట్‌ను డిసెంబర్ వరకు కంప్లీట్ చేయాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నాడని సమాచారం ఈ మూవీని ‘ఎన్టీఆర్..కథానాయకుడు’, ఎన్టీఆర్..మహానాయకుడు’ గా రెండు పార్టులుగా పదిహేను రోజుల వ్యవధిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది.