సినిమా వార్తలు

అప్పుడు తల్లి రుణం... ఇప్పుడు తండ్రి రుణం: బాలయ్య


8 months ago అప్పుడు తల్లి రుణం... ఇప్పుడు తండ్రి రుణం: బాలయ్య

తన తండ్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంపై తీసిన బయోపిక్ లో నటిస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక, జానపద సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని అన్నారు వాటిలో కొన్నింటిని నెరవేర్చుకున్నాని తెలిపారు. రామారావు అనగానే ప్రతీ తెలుగువాడికి ఆయన మహానుభావుడని గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ తో కలిసి బాలయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం తనకు తండ్రి మాత్రమే కాదనీ, తన పాలిట గురువు, దైవం అని వ్యాఖ్యానించారు. ఆయన కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం, రాజకీయరంగ ప్రవేశంతో పాటు తెలియని కోణాలను సైతం ఆవిష్కరించే ప్రయత్నం చేశామని తెలిపారు. గతేడాది అక్టోబర్ లోనే మొదటి భాగం‘కథా నాయకుడు’ను రిలీజ్ చేయాలని అనుకున్నామని బాలయ్య చెప్పారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9నే సినిమా రిలీజ్ కావాలని రాసిపెట్టి ఉందని పేర్కొన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి ద్వారా తల్లి రుణం, ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తండ్రి రుణం తీర్చుకుంటున్నానని బాలయ్య పేర్కొన్నారు.