సినిమా వార్తలు

అల్లు అర్జున్ మూవీతో రీ ఎంట్రీ ఖ‌రారు చేసుకున్న న‌గ్మా?


7 months ago అల్లు అర్జున్ మూవీతో రీ ఎంట్రీ ఖ‌రారు చేసుకున్న న‌గ్మా?

క‌థానాయ‌కులు చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ , శోభన్ బాబు ఇలా చాలామంది స‌ర‌స‌న‌ నటించిన సీనియర్ నటి నగ్మ..తాజాగా రీ ఎంట్రీ ఇవ్వనున్నార‌నేది హాట్ టాపిక్ గామారింది.  90 దశకంలో తెలుగు పరిశ్రమలో పెద్ద హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె త‌రువాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో కాలు మోపి బిజీ అయ్యారు. కాగా న‌గ్మా తాజాగా మళ్లీ ముఖానికి రంగేసుకునేందుకు సిద్దమయ్యారు.. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూత‌న‌ చిత్రం లో అల్లు అర్జున్ కు త‌ల్లి పాత్రలో నగ్మను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపుల దశలో ఉన్నారని స‌మాచారం. ఈ సినిమా కథ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు. గతంలో వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా తరహా లో ఉంటుంద‌ని అంటున్నారు. మార్చి లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇక ఈ సినిమాలో బన్నీ కి జోడిగా పూజా హగ్దే ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.