సినిమా వార్తలు

సమంత సినిమాలో నాగశౌర్య?


11 months ago సమంత సినిమాలో నాగశౌర్య?

సమంత కీలక పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణకొరియా కామెడీ డ్రామా చిత్రమైన 'మిస్ గ్రానీ' రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో నాగశౌర్య కీలక పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. నందిని రెడ్డి తెరకెక్కించిన 'కల్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు. నందిని దర్శకత్వం వహిస్తుండటంతో పాటు... కథ, పాత్ర నచ్చడంతో సినిమాకు నాగశౌర్య ఓకే చెప్పినట్టు సినీవర్గాల భోగట్టా.