సినిమా వార్తలు

నాగచైతన్య, నిత్యామీనన్ జంటగా...


9 months ago నాగచైతన్య, నిత్యామీనన్ జంటగా...

నాగచైతన్య కథానాయకుడిగా ప్రస్తుతం 'మజిలి' సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా తరువాత ఆయన మేర్లపాక గాంధీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ .. 'కృష్ణార్జున యుద్ధం'తో ప్రేక్షకులను నిరాశ పరిచారు. ఇటీవల ఆయన చైతూకి ఒక కథ వినిపించడం .. వెంటనే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి గా నిత్యామీనన్ అయితే బాగుంటుందని భావించిన మేర్లపాక గాంధీ .. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. దాదాపు ఆ పాత్రకి ఆమె ఖాయమైపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.