సినిమా వార్తలు

పరుశురాం దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌


7 months ago పరుశురాం దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌

అల్లు అరవింద్, నాగ చైతన్య కాంబినేష‌న్లో మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘100% లవ్‌’ సినిమా వ‌చ్చింది. అక్కినేని నాగ చైతన్య కథానాయకునిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమాను నిర్మించనున్నారనే వార్త వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహించనున్నార‌ని భోగ‌ట్టా. నాగచైతన్య గత కొన్ని రోజులుగా పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లినట్టు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. అల్లు అరవింద్‌తో ఈ చిత్ర కథ గురించి చర్చించడానికే వెళ్లారంటూ చెప్పుకుంటున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువ‌డ‌నుంద‌ని సమాచారం.