సినిమా వార్తలు

శామ్‌తో తన‘మజిలీ’ఇదే: చైతూ


11 months ago శామ్‌తో తన‘మజిలీ’ఇదే: చైతూ

హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా భారీ అంచనాల నడుమ నవంబర్ 2న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చైతూ ఈ సినిమా ప్రమోషన్ వర్క్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా ఆయన సమంతతో కలిని నటిస్తున్న‘మజిలీ’ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. అది ఆయన మాటల్లోనే...‘పెళ్లి తర్వాత నేను, సమంత కలిసి దర్శకుడు శివ నిర్వాణ పర్యవేక్షణలో నటిస్తున్నాం.

ఈ సినిమాలో భార్యభర్తలుగా నటిస్తున్నాం. షూటింగ్‌లో భార్య భర్తలుగా కాకుండా యాక్టర్లుగానే యాక్టింగ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టోరీలో చాలా గొడవలు ఉంటాయి. నిజజీవితంలో గొడవలు లేవు కాబట్టి.. మేమిద్దరం కథ ప్రకారం నటిస్తున్నాం. అలాగే సమంతతో మ్యారేజ్ తర్వాత మంచి మనిషిగా మారాను. వ్యక్తిత్వంలో పరిపూర్ణత లభించింది. పెళ్లికి ముందు పురుషుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి పరిపూర్ణతను తెస్తుంది. అది నా విషయంలోనూ జరిగింది. లైఫ్ హ్యాపీగా ఉండటంతో బ్యాలెన్స్‌గా మారింది. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ మేమిద్దరం కలిసి ఉండేలా ప్లాన్ చేసుకొంటాం. మా మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకొంటాం’ అని నాగచైతన్య వివరించారు.