సినిమా వార్తలు

‘అల్లరి అల్లుడు’గా రెచ్చిపోతున్న చైతూ


11 months ago ‘అల్లరి అల్లుడు’గా రెచ్చిపోతున్న చైతూ

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' నవంబరు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా నిధి అగర్వాల్ పరిచయం కానుంది. ప్రతినాయకుడిగా మాధవన్ కనిపించనున్న ఈ సినిమాలో భూమిక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున హీరోగా గతంలో వచ్చిన 'అల్లరి అల్లుడు' సినిమాలోని 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు ..' అనే హిట్ సాంగ్ ను 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేశారు.

గతంలో కీరవాణి స్వరపరిచిన ఆ పాటను మళ్లీ ఆయనే ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఈ రీమిక్స్ సాంగ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈనాటి ట్రెండ్ కి తగినట్టుగానే ఈ పాటకు ట్యూన్ చేసి, షూట్ చేశారని తెలుస్తోంది. నాయకా నాయికలపై చిత్రీకరించిన ఈ పాట, ఫాస్టు బీట్ గా యూత్ కి కనెక్ట్ అయ్యేలానే ఉందనే టాక్ వినిపిస్తోంది.