సినిమా వార్తలు

‘బరైలీ కీ బర్ఫీ’ రీమేక్‌లో చైతూ


8 months ago ‘బరైలీ కీ బర్ఫీ’ రీమేక్‌లో చైతూ

బాలీవుడ్‌లో ఘన విజయం అందుకున్న ‘బరైలీ కీ బర్ఫీ’ రీమేక్‌ చిత్రంలో నాగచైతన్య నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల చెబుతున్నాయి. అశ్విని అయ్యర్‌ తివారి తెరకెక్కించిన ‘బరైలీ కీ బర్ఫీ’ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు, కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీ, బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఒక కథానాయకుడిగా నాగచైతన్యను ఎంపికచేసినట్లు సమాచారం. ప్రముఖ రచయిత కోనవెంకట్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. పెళ్లి పేరుతో ఇంట్లో తల్లిదండ్రులు బలవంతపెడుతుండడంతో ఓ యువతి రైలెక్కి పారిపోవాలనుకుంటుంది. అలా ఓ రైల్వే స్టేషన్‌లో ‘బరైలీ కీ బర్ఫీ’ అనే పుస్తకాన్ని కొంటుంది. దాన్ని చదివిన తర్వాత ఆ రచయితను కలవాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథాంశం.