సినిమా వార్తలు

షూటింగులో చేరిన చైతూ, సమంత


11 months ago షూటింగులో చేరిన చైతూ, సమంత

పెళ్లికి ముందుకు టాలీవుడ్ జంట చైతూ .. సమంత కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. పెళ్లి తరువాత ఈ జంటను తెరపై చూడాలని అభిమానులంతా ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి దర్శకుడు శివ నిర్వాణ ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. నిన్నమొన్నటి వరకూ చైతూ .. సమంత విదేశాల్లో ఉండటంతో, ఇతర పాత్రలకి సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించారు. వారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైతూ .. సమంత తాజాగా ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో, చైతూ, సమంత భార్యాభర్తలుగా నటిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

అంతకుమందు విదేశీ పర్యటనలో సరదాగా గడిపిన అక్కినేని కుటుంబం తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలను షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. తమ టూర్ ముగించుకుని అక్కినేని కుటుంబం తిరిగి ఇండియాకు చేరుకున్న విషయాన్ని నాగార్జున, సమంత తమ ట్వీట్ల ద్వారా తెలిపారు. నాగచైతన్యంతో వివాహం తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఆయన పక్కనుంటే తనకు ఎంతో ధైర్యంగా ఉంటుందని సమంత పేర్కొంది.