సినిమా వార్తలు

విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న నాగ‌బాబు స్కిట్‌


7 months ago విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న నాగ‌బాబు స్కిట్‌

మెగా బ్రద‌ర్‌ నాగబాబు ‘మై ఛానెల్ నా ఇష్టం’ ద్వారా మరో స్కిట్  విడుద‌ల చేశారు. ‘బ్యాంకాక్ లో జరిగిన యథార్థ సంఘటన’ అంటూ ఈ వీడియోలో తన స్కిట్ ను పోస్ట్ చేశారు. ‘బాలానంద మహరాజ్ కి జై..’ అంటూ ప్రారంభమయ్యే ఈ స్కిట్ లో ఓ స్వామిజీ, ఇద్దరు శిష్యుల పాత్రలు క‌నిపిస్తాయి. ఆ స్వామిజీని ఈ ఇద్దరు శిష్యులు ప్రశ్నించడం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. ఈక్రమంలో ‘బయోపిక్ అంటే ఏమిటి స్వామిజీ?’, ‘ఎర్రిపప్పలు అంటే ఎవరు స్వామి?’ ‘పప్పూ అంటే ఎవరు స్వామి?’, ‘ఎప్పటికీ పూర్తి కానిది ఏది స్వామి?’... ‘తీర్థయాత్రలకు పాదయాత్రలకు తేడా ఏమిటి స్వామి?’, ‘ప్రత్యేక హోదా అంటే ఏంటి?’ అనే ప్రశ్నలకు స్వామిజీ రాజకీయ సెటైర్లు విసరడం కనిపిస్తుంది.