సినిమా వార్తలు

నాగ్, ధనుష్ సినిమా లేనట్లేనా?


9 months ago నాగ్, ధనుష్ సినిమా లేనట్లేనా?

మల్టీ స్టారర్ చిత్రాలకు చాలాకాలం క్రితమే హీరో నాగార్జున తెరతీశారు. దీనికితోడు ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ చిత్రాలజోరు మరింత పెరిగింది. దాంతో తెలుగులో 'దేవదాస్' వంటి మల్టీ స్టారర్ మూవీ చేసిన నాగ్, హిందీలోనూ ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళంలోను ఒక మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. ఈ సినిమాలో మరో హీరోగా ధనుశ్ నటించనున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు కూడా ధనుశ్ కావడం విశేషం. 'మారి 2' తరువాత మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. అయితే ధనుశ్ తాను సోలో హీరోగా చేస్తోన్న 'అసురన్' సినిమాను మొదలుపెట్టేశాడు. దాంతో నాగ్ తో ఆయన చేయనున్న సినిమాపై కోలీవుడ్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నిర్మాతలు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని అంటున్నారు. అయితే ఈ సినిమాను ఆలస్యంగానైనా పట్టాలెక్కిస్తారా? అసలు ఆ ఉద్దేశమే లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సివుంది.