సినిమా వార్తలు

‘యాత్ర’లో నా పాత్ర గుర్తుండిపోతుంది: అనసూయ


9 months ago ‘యాత్ర’లో నా పాత్ర గుర్తుండిపోతుంది: అనసూయ

ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెర ప్రేక్షకులను అనసూయ తనదైన శైలిలో అలరిస్తోంది. యూత్ లో ఆమెకున్న క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. అనసూయ న్యూ ఇయర్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో చాట్ చేసింది. 'మీ వంటిపై వున్న టాటూ ఏమిటీ? మీ మొదటి పారితోషికం ఎంత?' అని ఒక అభిమాని ఆమెను అడిగాడు. అందుకు అనసూయ స్పందిస్తూ .. 'నా వంటిపై వున్న టాటూ 'నిక్కూ' .. అది మా ఆయన ముద్దు పేరు'. ఇక నేను అందుకున్న తొలి పారితోషికం 5,500 అని చెప్పింది. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా వస్తోన్న 'యాత్ర'లో మీ పాత్ర ఏమిటి?' అనే ప్రశ్నకి అనసూయ సమాధానాన్ని దాచేసింది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పను. ఆ పాత్ర నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పగలను" అని అంది.  దీంతో 'యాత్ర'లో అనసూయ చేసిన పాత్ర ఎలాంటిదనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది.