సినిమా వార్తలు

నా బిజినెస్ మ్యాన్ క‌ల నెర‌వేరింది: మ‌హేష్‌


10 months ago నా బిజినెస్ మ్యాన్ క‌ల నెర‌వేరింది: మ‌హేష్‌

ప్రిన్స్‌ మహేష్ బాబు ఇటీవ‌లే 'ఏఎంబీ' పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ సంస్థకు చెందిన ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్... తన కొత్త బిజినెస్ గురించి తెలిపారు. మల్టీప్లెక్స్ బిజినెస్ అనేది తన కల అని చెప్పారు. తన కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. ఏషియన్ ఫిల్మ్స్ సహకారంతో తాను ఈ బిజినెస్ చేస్తున్నట్టు వెల్లడించారు. తన ప్రథమ ప్రాధాన్యం నటనకేనని... ఈ తర్వాతే బిజినెస్ అని చెప్పారు. సినిమాలు, వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలు చూడటం తనకు ఇష్టమని, ఇప్పుడు త‌న‌కు సొంత మల్టిప్లెక్స్ ఉండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.