సినిమా వార్తలు

హీరోగా కీరవాణి పుత్రరత్నం


11 months ago హీరోగా కీరవాణి పుత్రరత్నం

చిత్రపరిశ్రమలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడమనేది కొత్తవిషయమేమీ కాదు. సీనియర్ హీరోల తనయులు .. దర్శక నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తుండటం చూస్తుంటాం. తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి ఫ్యామిలీ నుంచి హీరో వస్తుండటం విశేషం. సంగీత దర్శకుడిగా కీరవాణికి గల పేరు ప్రతిష్ఠలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.

ఇప్పటికే కీరవాణి పెద్దబ్బాయి 'కాలభైరవ' సింగర్ గా తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇక చిన్నబ్బాయి 'సింహ' మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తోనే అయినా ఒక అసాధారణమైన థీమ్ తో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిప పూర్తి వివరాలను తెలియనున్నాయి.