సినిమా వార్తలు

సంక్రాంతి బరిలోకి ‘మిస్టర్ మజ్ను'


1 year ago సంక్రాంతి బరిలోకి ‘మిస్టర్ మజ్ను'

అక్కినేని అఖిల్ హీరోగావెంకీ అట్లూరి దర్శకత్వంలో  'మిస్టర్ మజ్ను' రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా చాలా వరకూ విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్లే బాయ్ గా అఖిల్ కనిపించడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేసే ఆలోచనలో టీమ్ వున్నట్లు సమాచారం. అయితే యూత్ నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన తరువాత, సంక్రాంతికి రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో 'ఎన్టీఆర్' బయోపిక్ .. చరణ్ - బోయపాటి మూవీ .. 'ఎఫ్ 2' సినిమాలు వున్నాయి. అయినా పండుగ రోజుల్లోనే రావడానికి 'మిస్టర్ మజ్ను' ఉత్సాహాన్ని చూపుతున్నాడట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు సమాచారం. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'మిస్టర్ మజ్ను' మూవీ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్టైల్ పరంగా, లుక్స్ పరంగా అఖిల్ అందరితో సూపర్భ్ అనిపిస్తున్నాడు. ఇక అమ్మాయిలైతే అఖిల్ లుక్స్ చూసి ఫిదా అయిపోతున్నారట. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ప్లేబోయ్ పాత్రలో కనిపించబోతున్నాడని తాజా టీజర్ చూస్తే వెల్లడవుతోంది.