సినిమా వార్తలు

ఫిబ్రవరి 14 మిస్టర్ మజ్ను విడుద‌ల‌?


1 year ago ఫిబ్రవరి 14 మిస్టర్ మజ్ను విడుద‌ల‌?

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ ఇప్పటికే కొంతవరకూ పూర్త‌య్యింది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా వుండటంతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే ఆ తేదీకి రెండు రోజుల ముందు 'ఎన్టీఆర్ మహానాయకుడు' థియేటర్లలోకి వచ్చేస్తోంది. దాంతో 'మిస్టర్ మజ్ను' విడుదల తేదీని వాయిదా వేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయడం కలిసొస్తుందనే ఆలోచనలో నిర్మాత‌లు ఉన్నార‌ని స‌మాచారం