సినిమా వార్తలు

‘మిస్టర్‌ మజ్ను’ టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియో విడుద‌ల‌


10 months ago ‘మిస్టర్‌ మజ్ను’ టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియో విడుద‌ల‌

అక్కినేని అఖిల్‌ నటిస్తున్న సినిమా ‘మిస్టర్‌ మజ్ను’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ స‌మ‌కూర్చారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ అనే పాటకు మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు. ‘దేవదాసు మనవడు.. మన్మథుడికి వారసుడు.. కావ్యంలో కాముడు.. అంతకన్నా రసికుడు..’ అని సాగే ఈ పాటకు తమన్‌ చక్కటి బాణీలు కూర్చారు. రమ్య ఎన్.ఎస్.‌కె పాటను ఆలపించారు. శ్రీమణి పాటకు సాహిత్యం అందించారు. శేఖర్‌ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి.