సినిమా వార్తలు

19న 'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ ఈవెంట్


8 months ago 19న 'మిస్టర్ మజ్ను'  ప్రీ రిలీజ్ ఈవెంట్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరో అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' నిర్మితమైంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా అఖిల్ కనిపించనున్నారు. ఈ సినిమా హిట్ కావలసిన అవసరం అఖిల్ కి ఎంతోవుంది. ఇక 'సవ్యసాచి'తో నిరాశ చెందిన నిధి అగర్వాల్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ సాయపడుతుందో వేచిచూడాలి.