సినిమా వార్తలు

‘అత్తారింటికి దారి’తీస్తున్న ‘మిస్టర్ మజ్ను’


11 months ago ‘అత్తారింటికి దారి’తీస్తున్న ‘మిస్టర్ మజ్ను’

అక్కినేని అఖిల్ అమ్మాయిల వెంటనడిచే రోమియోగా ‘మిస్టర్ మజ్ను’ టీజర్‌తో హల్ చల్ చేస్తున్న విషయం విదితమే. అఖిల్ నటించినతొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో ఇప్పుడు తన మూడో చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ యంగ్ హీరో. ‘తొలిప్రేమ’ చిత్రంతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ‘మిస్టర్ మజ్ను’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ మజ్నుకి జోడీగా కనిపించనుంది. ఇటీవల విడదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ అప్డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రెండు పాటలు, రెండు ఫైట్స్ సీక్వెన్సులు మినహా దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై ఆసక్తికర  మరో ప్రచారం నడుస్తోంది. ఈ చిత్రంలో రోమియోగా మిస్టర్ మజ్ను ఉంటున్నప్పటికే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటి దారేది’ చిత్ర ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయని టాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది.

కొన్ని సీన్లు ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని పోలి ఉండినప్పటికీ కథ, కథనాలు వెంకీ అట్లూరి స్టైల్‌లో ఉంటాయని సమాచారం. క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం అఖిల్ ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని చాలా సార్లు చూశారట కూడా. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.