సినిమా వార్తలు

ఆసక్తికరంగా 'మిస్టర్ మజ్ను' ఫస్టులుక్


8 months ago ఆసక్తికరంగా 'మిస్టర్ మజ్ను' ఫస్టులుక్

అఖిల్ తాజా చిత్రంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. 49 సెకన్ల వీడియో క్లిప్ ను విడుదల చేశారు. ఒక సాంగ్ బిట్ .. ఒక డైలాగ్ పై ఈ వీడియో ను కట్ చేశారు."దేవదాసు మనవడు .. మన్మథుడికి వారసుడు .. కావ్యములో కాముడు .. అంతకన్నా రసికుడు .. "అంటూ ఈ సాంగ్ సాగుతోంది. "దేన్నయితే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు" అనే అఖిల్ డైలాగ్ ఈ వీడియోలో కనిపిస్తోంది. కొత్త లుక్ తో కనిపిస్తూ అఖిల్ ఆకట్టుకుంటున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.