సినిమా వార్తలు

‘మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరో’


9 months ago ‘మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరో’

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం ట్రైలర్ లోని యాక్షన్ సీన్ లో రామ్ చరణ్ ఇరగదీశాడు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం తన భర్త రామ్ చరణ్ చాలా కష్టపడ్డారని ఉపాసన చెప్పారు. ఈ సినిమా సెట్ లో తీసిన ఓ వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం సిద్ధమవుతున్న రామ్ చరణ్ ఈ వీడియోలో కనిపించాడు. కష్టమైన యాక్షన్ సీక్వెన్స్ కు ముందు మై రాం-బో వర్కవుట్ చేశారని, అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ ఆయన ఒంటిపై చొక్కా లేదని వివరించారు. ‘మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరో’ అని తన భర్తను ఉపాసన ప్రశంసలతో ముంచెత్తారు. చరణ్ కు కంపెనీ ఇచ్చిన కనల్ కన్నన్ కు ధన్యవాదాలు. ఆయన ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయని ఆ ట్వీట్ లో ఉపాసన తెలిపారు.