సినిమా వార్తలు

ప్రధానిగా మోహన్‌లాల్.. బాడీగార్డ్‌గా సూర్య?


11 months ago ప్రధానిగా మోహన్‌లాల్.. బాడీగార్డ్‌గా సూర్య?

ఓ వైపు త‌మిళంలో ఎన్జీకే సినిమాలో నటిస్తూనే.. మరోవైపు తన 37వ సినిమా చిత్రీకరణలో తమిళ హీరో సూర్య బిజీగా ఉన్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 37వ చిత్రం సెట్‌లో తీసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారి హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర తాలుకు ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీనికి కారణం ఆ ఫోటోల్లో మోహన్‌లాల్ లుక్ ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉండడమే. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆయన ప్రధానిగా నటిస్తున్నారని భావిస్తున్నారు. ఈ ఫోటోలను బట్టి చూస్తే సూర్య ప్రధానికి బాడీగార్డ్‌గా కనిపిస్తున్నారు. మరోపక్క ఆర్య కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదట ఈ పాత్ర కోసం అల్లు శిరీష్ ని తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి శిరీష్ తప్పుకోవడంతో ఆ పాత్రలో ఆర్య నటిస్తున్నార‌ని స‌మాచారం.