సినిమా వార్తలు

మోహన్ బాబు కుటుంబంలో విషాదం


12 months ago మోహన్ బాబు కుటుంబంలో విషాదం
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మోహన్‌బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ(85) కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో గురువారం ఉదయం ఆరు గంటలకు మంచు లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి. లక్ష్మమ్మ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు