సినిమా వార్తలు

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో మోహ‌న్ బాబు హ‌ల్‌చ‌ల్‌?


7 months ago ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో మోహ‌న్ బాబు హ‌ల్‌చ‌ల్‌?

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మోహ‌న్‌బాబు పాత్ర ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో మోహ‌న్ బాబుతో చాలా సన్నిహితంగా ఉండేవారు. దానికి తోడు ల‌క్ష్మీ పార్వ‌తితోనూ మోహ‌న్ బాబు బాగానే ఉండేవారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర‌వాత‌.. మోహ‌న్‌బాబుకీ – ల‌క్ష్మీ పార్వ‌తికీ మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని చెబుతుంటారు. `మోహ‌న్ బాబు దుర్మార్గుడు` అని ఓ సంద‌ర్భంలోల‌క్ష్మీ పార్వ‌తి స్టేట్‌మెంట్ ఇచ్చారు . అలా ఎందుకు స్పందించాల్సివ‌చ్చిందో స‌వివ‌రంగా వ‌ర్మ ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని భోగ‌ట్టా. అయితే మోహ‌న్ బాబుని నెగిటివ్ గా చూపించే ద‌మ్ము, ధైర్యం వ‌ర్మ‌కి ఉన్నాయా? అనే ప్ర‌శ్న‌ అంద‌రి మ‌దిలో మెదులుతోంది. ఎందుకంటే `రౌడీ` పేరుతో గ‌తంలో వ‌ర్మ‌..మోహ‌న్ బాబుతో ఓ సినిమా తీశారు. అలాగే మంచు విష్ణు, మ‌నోజ్‌ల‌తోనూ ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో వ‌ర్మ‌కీ మంచు కుటుంబానికీ మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డింది. దీంతో మోహ‌న్ బాబుని వ‌ర్మ ఈ సినిమాలో ఎలా చూపించ‌నున్నార‌నేది ఆస‌క్తికరంగా మారింది.