సినిమా వార్తలు

‘సైరా' క్లైమాక్స్ లో మార్పులు?


1 year ago ‘సైరా' క్లైమాక్స్ లో మార్పులు?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా  'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు విదేశాల్లో జరుగుతోందని తెలుస్తోంది. ఆంగ్లేయులతో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తలపడే భారీ పోరాట సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ ను మార్చారనేది తాజా సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆంగ్లేయులు బంధించి ఉరితీసి, ఆయన తలను కోట గుమ్మానికి వెళ్లాడదీశారు. తిరుగుబాటుదారులు భయపడటం కోసం ఆంగ్లేయులు ఆ రోజుల్లో అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అదే క్లైమాక్స్ అయితే అభిమానులు నిరాశ చెందే అవకాశం ఎక్కువగా ఉందని చిత్ర యూనిట్ భావించింది. అందువలన ఆ సన్నివేశం చూపించకుండగా, ఉయ్యాలవాడ స్ఫూర్తితో మరికొందరు విప్లవ వీరులు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారనే విషయాన్ని ప్రస్తావిస్తూ ముగిస్తారని అంటున్నారు. వేసవి సెలవుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఇదిలావుండగా సైరా ఈ సినిమా గురించి నన్ను ఏమి అడగవద్దని మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి సైరా కు ముందుగా రహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. మరి ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సడెన్ గా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ని తీసుకున్నారు. ఇంటర్వ్యూ లు ఇచ్చే ముందే రహమాన్ ‘సైరా’ నుండి మీరు ఎందుకు బయటకు వచ్చారనే విషయం పై ప్రశ్నలు తప్ప వేరేవి ఏవైనా అడగండి నేను సమాధానం చెపుతానని ముందే చెప్పారని తెలుస్తోంది.