సినిమా వార్తలు

అన్నేమో 'ఎన్టీఆర్'..తమ్ముడేమో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'


11 months ago అన్నేమో 'ఎన్టీఆర్'..తమ్ముడేమో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

‘ఎన్టీఆర్’ సినిమాల విషయంలో మరో ఆసక్తికర పరిణాం చోటుచేసుకుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు సంగీత దర్శకత్వం వహించే అవకాశం కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్ కు లభించింది. జీవీ ఫిల్మ్ సమర్పణలో తాను రూపొందించనున్న చిత్రానికి ప్రస్తుతం నటీనటులను ఫైనలైజ్ చేసే పనిలో రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కల్యాణి మాలిక్ ను తీసుకున్నామని వర్మ ప్రకటించారు.

కాగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ కు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ వర్మ... కీరవాణి సోదరుడైన కల్యాణి మాలిక్, అనుకోకుండా తన సినిమా కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఇది నిజంగా కాకతాళీయంగా జరిగిందని, ఉద్దేశ పూర్వకంగా ఆయనను ఈ ప్రాజెక్టుకు తీసుకోలేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.