సినిమా వార్తలు

గూగుల్ స్టార్... మన మెగాస్టార్


5 months ago గూగుల్ స్టార్... మన మెగాస్టార్

కొంతకాలం గ్యాప్ తర్వాత ‘ఖైదీ నం.150’ చిత్రంతో టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌తో చిరు బీజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. వయసు మీరుతున్నా ప్రేక్షకుల్లో తనకున్న ఇమేజీ ఏ మాత్రం తగ్గలేదని చిరంజీవి మరోసారి నిరూపించారు. 2018లో గూగుల్ సెర్చ్‌లో అత్యధిక చాలామంది వెదికిన తెలుగు నటుల్లో చిరంజీవి అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో ఆయన క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది.

చిరంజీవి తర్వాత నాని, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రష్మిక, అనసూయ, ప్రకాష్‌రాజ్, మోహన్‌బాబు, జగపతిబాబు‌, నాగశౌర్యల పేర్లు ఉన్నాయి. పాటల విభాగంలో వారూ వీరూ(దేవదాస్), మాటే వినదుగా(టాక్సీవాలా), మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్(హలోగురూ ప్రేమ కోసమే), ఇంకేం ఇంకేం కావాలే( గీతగోవిందం), పెనివిటి(అరవింద సమేత), ఏంటీ ఏంటీ(గీతగోవిందం) కోసం ఎక్కువ మంది సెర్చ్ చేశారు. సినిమాల విభాగంలో గీతగోవిందం, సర్కార్, రంగస్థలం, భరత్ అనే నేను, కాలా, 2.0, మహానటి, కృష్ణార్జున యుద్ధం, విశ్వరూపం-2 కోసం అధికశాతం నెటిజన్లు గూగుల్ సెర్చ్‌లో వెతికారు.