సినిమా వార్తలు

‘గల్లీ బాయ్’ పై మెగా హీరోల క‌న్ను


7 months ago ‘గల్లీ బాయ్’ పై మెగా హీరోల క‌న్ను

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం‘గల్లీ బాయ్’ ఘన విజయాన్ని సాధించింది. అలియా భట్ కథానాయికగా నటించిన ఈ సినిమా, 4 రోజుల్లో 70 కోట్లకి పైగా వసూళ్లను ద‌క్కించుకుంది. వైవిధ్యభరితమైన కథాకథనాలు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయంటున్నారు. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి  అగ్రనిర్మాత అల్లు అరవింద్ సిద్ద‌మ‌య్యార‌ట‌. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుని, మెగా హీరోలైన సాయిధరమ్ తేజ్ తో గానీ .. వైష్ణవ్ తేజ్ తో గాని తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆయ‌న వున్నట్టుగా తెలుస్తోంది.  అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని భోగ‌ట్టా. అయితే ఇదే సమయంలో మరో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇద్దరూ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉందంటున్నారు. దీనికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయట‌.. కాగా జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన కేరీర్ లోని అతిపెద్ద హిట్ గా నిలిచింది.