సినిమా వార్తలు

మెగా హీరో రికార్డు: ఇక్కడ ఫ్లాప్... అక్కడ హిట్


9 months ago మెగా హీరో రికార్డు: ఇక్కడ ఫ్లాప్... అక్కడ హిట్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ కోసం కొంతకాలంగా చాలా కష్టపడుతున్న విషయం విదితమే. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతీ సినిమా తేజుకి నిరాశనే మిగిల్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమా ‘చిత్రలహరి’ అయినా మంచి హిట్ కొట్టాలనే భావనతో పనిచేస్తున్నాడు. అయితే తేజు సినిమాలు టాలీవుడ్‌లో ఫ్లాప్ అయినప్పటికీ.. హిందీలో డబ్ అయిన చిత్రాలు మాత్రం యూట్యూబ్‌లో హిట్ అవుతున్నాయి.. అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. తేజుకి సంబంధించి హిందీలో డబ్ అయిన సినిమాలు.. ‘రేయ్’, సుప్రీం, జవాన్, తేజ్ ఐలవ్ యూ’ చిత్రాలు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను అందుకుంటున్నాయి. ‘రేయ్’ సినిమా 9.1 మిలియన్ వ్యూస్‌ను రాబడితే.. సుప్రీం మూవీ 27 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. ‘జవాన్’ చిత్రం 38 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టగా.. ‘తేజ్ ఐ లవ్ యూ’ 37 మిలియన్ల వ్యూస్‌ను అందుకోవడం విశేషం.