సినిమా వార్తలు

పూర్తిగా మారిపోయిన మాస్ మహారాజా


9 months ago పూర్తిగా మారిపోయిన మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ కు ఒకప్పుడు వరుసగా విజయవంతమైన సినిమాలు అందించాడు. ఫ్లాప్ లు అంతంతమాత్రంగానే పలుకరించేవి. అయితే ఈ మధ్య సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది.  గతంలో చేసిన విధంగానే రవితేజ మాస్ మసాలా సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు ఆదిరించడం లేదు. దీంతో వరస వైఫల్యాలను మాస్ రాజా ఎదుర్కొంటున్నాడు. ఫలితంగా ఒక విషయంలో రవితేజ కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్దమయ్యాడని సమాచారం.  అదే.. రెమ్యూనరేషన్. 

రవితేజ తన ఫీజు విషయంలో ఎప్పుడూ పక్కాగా వ్యవహరించేవాడట. అతను ఎంత చెబితే అంతే ఇవ్వలిఅట.  సినిమానైనా వదులుకునేవాడు గానీ తన రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదనే టాక్ వినిపించేది. అలా వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయని  చెబుతుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో కొంత తగ్గాడని అంటున్నారు. రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్నాడు. మొదట్లో ఈ సినిమాకు రూ.. 10 కోట్ల రెమ్యూనరేషన్ అనుకున్నారట. కానీ వరస ఫ్లాపులతో తన మార్కెట్ దెబ్బతినడంతో ఓపెనింగ్స్ కూడా తగ్గిన నేపధ్యంలో రెమ్యూనరేషన్ ను రూ. 5 కోట్లకు తగ్గించుకున్నాడని తెలుస్తోంది.