సినిమా వార్తలు

ఎన్టీఆర్ కోసం చెయ్యివిరగొట్టిన మనోజ్


1 year ago ఎన్టీఆర్ కోసం చెయ్యివిరగొట్టిన మనోజ్

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హీరోల్లో మంచు మనోజ్ ముందుగా కనిపిస్తారు. తన అభిమానులు పెట్టిన ట్వీట్ లకు, రీట్వీట్ లు పెడుతుండటం చేస్తుంటారు. కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టినా, ఎటువంటి సంగతుల గురించి అడిగినా మనోజ్ సరదాగా సమాధానమిస్తున్నాడు. కాగా, తాజాగా ట్వీటర్ లో ఓ అభిమాని మనోజ్ ని ఓ  ప్రశ్న అడిగాడు.‘మీరు చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరో కొట్టినపుడు మీరు అడ్డు వెళ్లి.. ఎన్టీఆర్ పై చెయ్యి ఎత్తిన వాడి చెయ్యి విరగ్గొట్టారని తెలిసింది.

చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి చెప్పమని  కోరాడు. దాంతో మనోజ్ ఆ అభిమానికి సమాధాన మిస్తూ ‘ఆ సంగతి తారక్‌నే అడుగు. ఈ విషయం గురించి నాకంటే తనే బాగా చెప్తాడు’ అని పేర్కొన్నాడు. ఏదిఏమైనప్పటికీ సాటి హీరో కోసం హీరోకాకముందునుంచే అభిమానం వ్యక్తం చేయడం గొప్పవిషయమే కదా!