సినిమా వార్తలు

మూడు భాషల్లో 'మణికర్ణిక'


9 months ago మూడు భాషల్లో 'మణికర్ణిక'

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఈసారి చారిత్రక నేపథ్యంతో ముడిపడిన కథాంశాన్ని ఎంపికచేసుకుంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతోన్న 'మణికర్ణిక' సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు .. తమిళ భాషల్లో జనవరి 25వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకి చాలావరకూ క్రిష్ దర్శకత్వం వహించగా, ఆ తరువాత దర్శకత్వ బాధ్యతలను కంగనానే చూసుకున్నారు. శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే కంగనా భావిస్తోంది.