సినిమా వార్తలు

మరో వివాదంలో చిక్క‌కున్న ‘మణికర్ణిక’


10 months ago మరో వివాదంలో చిక్క‌కున్న ‘మణికర్ణిక’

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మణికర్ణిక’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముఖ్య‌మైన భాగం షూటింగ్ పూర్త‌య్యాక.. తుదిదశలో అనుకోని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దీంతో కంగనా స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేప‌ట్టింది. అప్ప‌టి నుంచి ఈ సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ తరుణంలో తాజాగా మరో వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది ‘మణికర్ణిక’. ఇప్పటికీ తమకు రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదంటూ చిత్రబృందంలోని కొందరు ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ)ను ఆశ్రయించారు. ఈ మేరకు వర్కర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు ఇలా యూనిట్ సభ్యులంతా సెట్ నుంచి బయటకు వచ్చి  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార‌ని స‌మాచారం.

లైట్‌మెన్‌కి సుమారు 90 లక్షలు, జూనియర్ ఆర్టిస్టులకు సుమారు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని.. అయితే తమకు నిర్మాత కమల్ జైన్ అక్టోబర్ నెలలో డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఇంకా ఇవ్వలేదని వారు వాపోయారు. దీంతో జనవరి 25న విడుదల కావాల్సిన ‘మణికర్ణిక’ అనుకున్న సమయానికి వస్తుందా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.