సినిమా వార్తలు

`మిసెస్ సుబ్బలక్ష్మి`గా మంచు లక్ష్మి


5 months ago `మిసెస్ సుబ్బలక్ష్మి`గా మంచు లక్ష్మి

మధ్యతరగతి గృహిణి పాత్రలో మంచు లక్ష్మి  నటిస్తున్న వెబ్ సిరీస్ `మిసెస్ సుబ్బలక్ష్మి`. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అవసరాల శ్రీనివాస్, మహేష్ విట్టా, జబర్దస్త్ వేణు కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ దాదాపుగా పూర్తయ్యింది. ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 8న జీ5 యాప్‌లో, వెబ్‌లో `మిసెస్ సుబ్బలక్ష్మి`ని తిల‌కించ‌వ‌చ్చు. మార్చి 8న మహిళా దినోత్సవం. మంచు లక్ష్మి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. `ఈ గృహిణి ఇంట్లో గందరగోళం సృష్టిస్తుంది మహిళా` అనే క్యాప్ష‌న్‌తో జీ5 టీమ్ `మిసెస్ సుబ్బలక్ష్మి`కి ప్రచారం సాగిస్తోంది. మ‌రి మహిళా దినోత్సవాన మంచు లక్ష్మి నెట్టింట్లో ఎంత హంగామా చేస్తారో వేచి చూడాల్సిందే