సినిమా వార్తలు

2న మజ్ను టీజర్ విడుదల


9 months ago 2న మజ్ను టీజర్ విడుదల

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేస్తుకుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అఖిల్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను జనవరి 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్నిఅందించారు. జనవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు అఖిల్ చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈ సినిమాపైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. అఖిల్ అభిమానులు కూడా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు.