సినిమా వార్తలు

‘మజిలీ’ వీడియో లీక్: షాకైన సమంత


9 months ago ‘మజిలీ’ వీడియో లీక్: షాకైన సమంత

ప్రస్తుతం 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రంలో అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. చిత్రానికి సంబంధించి ఓ ఇంటిలో కూర్చొని చైతు-సామ్ మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి  లీక్ అయింది.

దీన్ని సామ్ వీరాభిమాని ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఈ వీడియో చూశాక.. అద్భుతమైన భావన కల్గింది. మీరు చైతన్యతో ఏదైనా టాప్‌ సీక్రెట్‌ మాట్లాడుతున్నారా సమంత? ‘మజిలీ’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’’ అని అభిమాని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ని చూసిన సామ్ షాక్ అయిన ఎమోజీలను కామెంట్‌గా పెట్టింది. తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.